'అక్షరాస్యతను పెంచేందుకు అందరం కృషి చేద్దాం'

ELR: వయోజనుల్లో నిరక్షరాస్యతను తగ్గించి అక్షరాస్యతను పెంచేందుకు అందరూ కృషి చేయాలని అక్షరాంద్ర జిల్లా కోఆర్డినేటర్ విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం మండల సమైక్య కార్యాలయంలో వాలంటరీలకు అక్షరాంద్ర శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు అక్షరాంధ్ర పుస్తక కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యాక్రమంలో ఎంపీడీవో మనోజ్, ఏపీఎం ప్రభావతి, ఎంఈవో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.