ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
PLD: పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మంగళవారం నరసరావుపేట మార్కెట్ యార్డ్‌లోని ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం యంత్రాలు, వీవీప్యాట్‌లు భద్రపరిచిన గోడౌన్‌కు వేసిన భద్రతా సీళ్లను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును, సెక్యూరిటీ లాగ్ బుక్‌ను కూడా తనిఖీ చేసి సంతకం చేశారు. ఈ తనిఖీలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.