బాధిత కుటుంబాన్నీ పరామర్శించిన ఎమ్మెల్యే
MBNR: రాజాపూర్ మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో శుక్రవారం అగ్నిప్రమాదంలో కాకర్ణాల ఆంజనేయులు నిర్వహిస్తున్న పంచర్ షాప్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హుటాహుటిగా సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితులను పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ధైర్యం చెప్పారు.