ఆసీస్‌పై ఇండియా గెలిచింది రెండేసార్లు!
మహిళల వన్డే ప్రపంచ కప్‌లో నిన్న సెమీస్-2లో ఆస్ట్రేలియాపై ఇండియా గెలిచి చరిత్ర సృష్టించింది. అయితే గత 19 మ్యాచ్‌ల్లో టీమిండియా మహిళలు.. ఆసీస్‌పై కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే గెలిచారు. మిగిలిన 17 మ్యాచ్‌ల్లోనూ కంగారులదే పైచేయి. 2017 సెమీస్‌లో ఆసీస్‌పై భారత్ గెలవగా.. మళ్లీ ఇప్పుడే కంగారులపై భారత్ గెలిచి.. ఫైనల్‌కు దూసుకెళ్లింది.