అరైవ్-అలైవ్ లక్ష్యంతో పోలీసులకు కంటి పరీక్షలు

అరైవ్-అలైవ్ లక్ష్యంతో పోలీసులకు కంటి పరీక్షలు

WNP: రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా కొనసాగుతున్నామని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కంటి పరీక్షలు నిర్వహించారు. టౌన్ ఎస్సై హరిప్రసాద్ మాట్లాడుతూ.. సురక్షిత ప్రయాణానికి స్పష్టమైన కంటి చూపు అత్యంత ముఖ్యమని ఆయన తెలిపారు.