చాపాడు ఆధార్ కేంద్రంలో MRO తనిఖీ

చాపాడు ఆధార్ కేంద్రంలో MRO తనిఖీ

కడప: మండల కేంద్రమైన చాపాడు ఆధార్ సెంటర్‌ను స్థానిక తహశీల్దార్ రమాదేవి మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వం నిర్దేశించిన సర్వీస్ చార్జీలను మాత్రమే వసూలు చేయాలని ఆపరేటర్‌కు సూచించారు. అదనంగా వసూళ్లు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆస్ఐ శంకర్ రెడ్డి పాల్గొన్నారు.