క్రికెట్.. కువైట్ చేతిలో భారత్ ఓటమి
హాంకాంగ్ సిక్సర్స్ టోర్నీలో భాగంగా కువైట్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కువైట్ 106/5 స్కోర్ చేయగా.. లక్ష్యఛేదనలో దినేష్ కార్తీక్ నేతృత్వంలోని భారత జట్టు 79/6కే పరిమితమైంది. కువైట్ కెప్టెన్ యాసిన్ పటేల్ 58 రన్స్, 3 వికెట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు.