మంత్రిని కలిసిన పాణ్యం MLA

KRNL: రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ, గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్‌లో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్ పర్సన్‌గా కే.పార్వతమ్మ పదవి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించారు.