ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన మంత్రి
GNTR: తెనాలి క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు అందజేసిన అర్జీలను స్వీకరించి సమస్యలను శ్రద్ధగా విన్న మంత్రి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు.