ఉత్తమ రక్తదాన ఉద్యమ అవార్డు గ్రహీతగా నరేష్

ఉత్తమ రక్తదాన ఉద్యమ అవార్డు గ్రహీతగా నరేష్

సత్యసాయి: పుట్టపర్తికి చెందిన నరేష్ ఉత్తమ రక్తదాన ఉద్యమ అవార్డు పొందారు. శనివారం అనంతపురంలో నిర్వహించిన ప్రపంచ రక్తదాతల దినోత్సవంలో జాయింట్ కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భారతీదేవి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, ఎమర్జెన్సీలో రక్తదాతలను సమకూర్చడం వల్ల ఈ అవార్డు దక్కడం జరిగిందని నరేష్ తెలిపారు.