VIDEO: కాకర్లపాడు గ్రామంలో తాగునీటి కష్టాలు

VIDEO: కాకర్లపాడు గ్రామంలో తాగునీటి కష్టాలు

MBNR: నవాబుపేట మండలం కాకర్లపాడు గ్రామంలో ప్రజలు తీవ్ర నీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత కొద్దిరోజులుగా నీటి సమస్య తీవ్రం కావడంతో నల్లవద్ద మహిళలు పెద్ద ఎత్తున నీటిని పట్టుకుంటున్నారు. ఈ సందర్భంలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రజా ప్రతినిధులు నీటి కష్టాలు తొలగించాలని కోరుతున్నారు.