నూతన అగ్నిమాపక కేంద్రానికి కేటాయించిన స్థలం పరిశీలించిన ఆర్డీఓ

ముద్దనూరు మండలం చెన్నారెడ్డి పల్లెలో అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని రెవెన్యూ డివిజనల్ అధికారి సాయిశ్రీ గురువారం పరిశీలించారు. ముద్దనూరు - తాడిపత్రి జాతీయ రహదారిలో సుమారు 0.78 సెంట్ల విస్తీర్ణంలో స్థలాన్ని గత ప్రభుత్వంలో అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని సాయి శ్రీ పరిశీలించారు.