'బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేయాలి'
KMM: బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని మాజీ జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. ఇవాళ బోనకల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.