ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన: ఎమ్మెల్యే

W.G: ఆకివీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు బుధవారం తనిఖీ చేశారు. పీహెచ్‌సీ లోని పలు విభాగాలను పరిశీలించారు. రోగులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలు మరియు సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న నూతన ఆసుపత్రి భవనాన్ని ఆయన పరిశీలించారు.