ప్రెస్ క్లబ్ భవనం నిర్మించాలి.. జర్నలిస్టుల పాదయాత్ర
సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల ఆత్మగౌరవ ప్రతీకగా ప్రెస్ క్లబ్ భవనం నిర్మించాలని టీఎస్ జేఏ ఆధ్వర్యంలో ఇవాళ శాంతియుత పాదయాత్ర నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం సాగిస్తామని వారు స్పష్టం చేశారు. అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.