అక్రమంగా ఆవులను తరలిస్తే కఠిన చర్యలు: ఎస్సై

WNP: అమరచింత మండలంలోని నాగల్ కడుమూరు గ్రామంలో బుధవారం పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో ఈ పికెట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా గోవులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బక్రీద్ పండుగ ముగిసే వరకు వాహనాల తనిఖీ కొనసాగుతుందన్నారు.