మంత్రి ఫారుక్‌ను కలిసిన కేడీసీసీ బ్యాంక్ సీఈవో
కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీ) సీఈవో శివలీల ఆదివారం నంద్యాల పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫారుక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఉమ్మడి జిల్లాలో కేడీసీసీ బ్యాంకు ద్వారా రైతులకు, ఖాతాదారులకు అందుతున్న సేవలను, బ్యాంక్ ప్రగతిని ఆమె మంత్రి ఫరూక్‌కు వివరించారు.