కాణిపాకం పరిధిలో చెరువులో గుర్తు తెలియని మృతదేహం
CTR: కాణిపాకం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మసముద్రం గ్రామ చెరువులో గుర్తు తెలియని మృతదేహం బయటపడటం కలకలం రేపింది. చెరువులో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని చెరువు నుంచి వెలికి తీశారు. ఈ ఘటన హత్యా? ఆత్మహత్యా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.