శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్న ఎమ్మెల్యే
ATP: అనంతపురంలోని కమలానగర్ రఘువీర టవర్స్‌లో టీడీపీ నాయకులు విక్రమ్ సింగ్ పురోహిత్, శోభా శారీస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులను అభినందించారు. అనంతరం ఆయన స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.