రేపు గోల్డెన్ టెంపుల్‌లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి

HYD: బంజారాహిల్స్ గోల్డెన్ టెంపుల్‌లో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి వేడులను ఆదివారం నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హరేకృష్ణ మూమెంట్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యగౌర చంద్ర దాస ప్రభూజీ తెలిపారు. తెలంగాణలో మొట్టమొదటి గోల్డెన్టెంపుల్ ఇదేనని, నరసింహస్వామి జయంతిని వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.