సోమందేపల్లిలో పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఎంపీడీవో

సోమందేపల్లిలో పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఎంపీడీవో

సత్యసాయి: సోమందేపల్లి మండల కేంద్రంలోని వినాయక నగర్లో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సోమందేపల్లి మండల MPDO వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ నగదు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సోమందేపల్లి మండల కన్వీనర్ వెంకటేశులు, మండల BJP అధ్యక్షులు మంజు, జనసేన మండలం కన్వీనర్ జాబిఉల్లా, తదితరులు పాల్గొన్నారు.