ఉచిత నర్సింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
NRML: సారంగపూర్ మండలం చించోలి(బి)గ్రామంలో ఉన్న దుర్గాబాయి మహిళా శిశువికాస కేంద్రంలో రెండేళ్ల ఉచిత నర్సింగ్(MPHIW, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్) శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రాంగణం అధికారి విజయలక్ష్మి శనివారం ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 35 ఏళ్లలోపు మహిళలు అర్హులన్నారు. ఆన్లైన్లో ఈనెల 25 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.