గాలింపు చర్యలను పరిశీలించిన సబ్ కలెక్టర్

PPM: భామిని మండలం లివిరి గ్రామంలో వంశధార నదిలో లక్ష్మీ అనే మహిళా గల్లంతైన విషయం తెలిసిందే. ఆమె ఆచూకీ కోసం NDRF సిబ్బంది నదిలో చేపట్టిన గాలింపు చర్యలను సబ్ కలెక్టర్ పవర్ స్వప్నల్ జగన్నాథం పరిశీలించారు. కుటుంబ సభ్యులను, స్థానిక గ్రామస్తులను జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. వంశధార నది ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున జాగ్రత్త వహించాలని సూచించారు.