లేబర్ కోడ్లను రద్దు చేయాలి: సీఐటీయూ

లేబర్ కోడ్లను రద్దు చేయాలి: సీఐటీయూ

కృష్ణా: కేంద్రం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి మాదల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మచిలీపట్నంలో బుధవారం సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐన్టీయూసీ, కౌలు రైతుల సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కిసాన్ కాంగ్రెస్ తదితర ప్రజా సంఘాల నాయకులు కోనేరు సెంటర్ నుంచి నవకళా సెంటర్ వరకు బుధవారం ర్యాలీ నిర్వహించారు.