తొర్రూరు కోర్డులో 398 కేసులు పరిష్కారం

తొర్రూరు కోర్డులో 398 కేసులు పరిష్కారం

MHBD: లోక్ ఆదాలత్ సందర్భంగా నిన్న తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టులో 398 కేసులు పరిష్కారమయ్యాయి. జడ్జి ధీరజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన, లోక్ అదాలత్‌లో రాజీ మార్గంలో కేసులు పరిష్కరించడంతోపాటు కక్షిదారులకు రూ.12.38 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీపీ రేవతి దేవి, సీఐ గణేష్, బార్ అధ్యక్షుడు ముకుందరావు, న్యాయవాదులు, ఎస్సైలు పాల్గొన్నారు.