VIDEO: ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది: IT మంత్రి

BHPL: మహాముత్తారం మండల కేంద్రంలో శుక్రవారం ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. కాళేశ్వరం నుంచి పలుగుల గ్రామం వరకు 7 కిలోమీటర్ల, డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.22 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.