గల్లంతైన యువకుడు మృతదేహం లభ్యం

ప్రకాశం: దొనకొండ మండలం చందవరం సమీపంలోని సాగర్ కాలవలో ఈతకు వెళ్లి గల్లంతైన యువకుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఎస్సై త్యాగరాజు గజ ఈతగాళ్లను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టగా గల్లంతైన ప్రాంతం నుంచి 200 మీటర్ల దూరంలో లభించింది. మృతుడు మండలంలోని పోలేపల్లి ఎస్సీ పాలెం చెందిన మనోజ్‌గా పోలీసులు తెలిపారు.