పీలేరులో ట్రాఫిక్ కష్టాలు

చిత్తూరు: పీలేరు నాలుగు రోడ్లు జంక్షన్ వద్ద తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వాహనాల రాకపోకలు భారీగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలింగ్ కోసం వచ్చిన ప్రజలందరూ తిరిగి బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్తుండటంతో ఇవాళ ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైంది.