కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి.. ఐదుగురు మృతి

HYD: రామంతాపూర్ గోకుల్ నగర్‌లో విషాద ఘటన జరిగింది. కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. శ్రీ కృష్ణ శోభాయాత్రలో రథానికి విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్‌తో ఐదుగురు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతులు రాజేంద్ర రెడ్డి, రుద్ర వికాస్, శ్రీ కృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్‌లుగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.