అధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని KMR జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశించారు. బుధవారం ఆయన నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. భారీ వర్షాల వల్ల ప్రాజెక్టు పొంగిపొర్లుతోందని చెప్పారు. ప్రాజెక్టుకు వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ సిబ్బంది, నీటి పారుదల శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.