దివ్యాంగుల పెన్షన్‌పై కలెక్టర్ కీలక ఆదేశాలు

TPT: 40 శాతానికి పైగా వైకల్యం ఉన్నట్లు ధృవపత్రం పొందిన దివ్యాంగులకు పెన్షన్ మంజూరు చేయనున్నట్లు తిరుపతి కలెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 1 నుంచి అర్హత కలిగిన దివ్యాంగులకు పెన్షన్ అందజేయనున్నారు. కాగా, అర్హులైన వారు సంబంధిత వార్డు, గ్రామ సచివాలయ సిబ్బందికి పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.