భూభారతి పెండింగ్ దరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష
JN: భూభారతి పెండింగ్ దరఖాస్తులపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సక్సెషన్, మ్యుటేషన్ వంటి దరఖాస్తులను నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పరిపాలనలో పారదర్శకత పెంచేందుకు ఈ-ఆఫీస్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించారు.