విద్యార్థులకు క్రికెట్ కిట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలుర క్రీడా పాఠశాల విద్యార్థులకు బుధవారం ఉదయం క్రికెట్ కిట్స్ ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పంపిణీ చేశారు. ఇటీవల జరిగిన సీఎం క్రీడా కప్ పోటీల్లో విజేతలుగా నిలిచి CM రేవంత్ రెడ్డి చే కప్ అందుకున్న ఉట్నూర్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులతో క్రికెట్ ఆడారు.