రైతులకు న్యాయం చేయకుంటే ఉద్యమిస్తాం: అంబటి

GNTR: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని పొన్నూరు వైసీపీ ఇంఛార్జ్ అంబటి మురళీ డిమాండ్ చేశారు. బృందావన్ గార్డెన్స్ వైసీపీ కార్యాలయంలో ఆదివారం అంబటి మాట్లాడారు. కొండవీటి వాగు పొంగి గుంటూరు ఛానల్లోకి రావడంతో ప్రవాహం ఎక్కవై కట్టలు తెగి పొలాల్లోకి నీరు వెళ్లిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలన్నారు.