సీఎం చంద్రబాబుతో భారత హైకమిషనర్‌ భేటీ

సీఎం చంద్రబాబుతో భారత హైకమిషనర్‌ భేటీ

AP: లండన్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుతో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి భేటీ అయ్యారు. యూకేలోని వివిధ వర్సిటీలు ఏపీతో నాలుగు అంశాల్లో భాగస్వామ్యంపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు అంశంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. వర్సిటీలు, విద్యాసంస్థల మధ్య విద్యార్థుల ఎక్స్ఛేంజ్ అంశంపై దొరైస్వామితో చంద్రబాబు మాట్లాడారు.