'ప్రతీ ఉపాధ్యాయుడు యుద్ధం చేయాలి'
KRNL: పదో తరగతి ఫలితాల కోసం ప్రతీ ఉపాధ్యాయుడు యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందని డీఈవో శ్యామ్యూల్ పాల్ అన్నారు. కోడుమూరు ఉన్నత పాఠశాలలో స్టడీ అవర్స్ తరగతులను శనివారం ఆయన పరిశీలించారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా పాఠ్యాంశాలపై అవగాహన కల్పించి, పాఠాలు పూర్తిగా నేర్పే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆయన తెలిపారు.