ప్రజల నుంచి 114 అర్జీలు స్వీకరించిన ఎస్పీ
ATP: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో SP జగదీష్ 114 అర్జీలు స్వీకరించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. చట్టపరిధిలో బాధితులకు తక్షణ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ఇస్కాన్ సహకారంతో ఉచిత భోజన సౌకర్యం కల్పించారు.