బీచ్‌లో ఇద్దరు విద్యార్థులు గల్లంతు
VSP: విశాఖ ఉడా పార్క్ వెనుక ఉన్న లైట్ హౌస్ బీచ్‌లో ఇవాళ సాయంత్రం ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఆదిత్య, తేజేష్ అనే యువకులు భారీ అలల తాకిడీకి సముద్రంలో కొట్టుకుపోయారు. మొత్తం 8 మంది యువకులు బీచ్‌కు రాగా నలుగురు యువకులు లోపలికి దిగారు. ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరగా ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.