VIDEO: బస్వాపూర్ పనులపై అసెంబ్లీలో వేముల ప్రస్తావన

VIDEO: బస్వాపూర్ పనులపై అసెంబ్లీలో వేముల ప్రస్తావన

NLG: నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం అసెంబ్లీలో బస్వాపూర్ రిజర్వాయర్ పనులపై ఇవాళ మాట్లాడారు. ఈ ప్రాజెక్టు ద్వారా నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు సాగునీరు అందుతుందని, ముఖ్యంగా రామన్నపేట, చిట్యాల మండలాల్లోని 50 వేల ఎకరాలకు మేలు జరుగుతుందన్నారు. పనులు వేగవంతం చేయాలని, మూసీపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు.