వీరత్వానికి ప్రతీక సర్వాయి పాపన్న

వీరత్వానికి ప్రతీక సర్వాయి పాపన్న

1650లో TGలో జన్మించిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. తన సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అనేక కోటలను గెలిచి.. నిజాం, మొగల్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు. తాటికొండ, బెల్గాం, గజ్వేల్ వంటి ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఔరంగజేబుపై పోరాడి మెదక్ దుర్గంపై జెండా ఎగురవేసి కోటను చేజిక్కించుకున్నారు. పాపన్న 1710లో వీరమరణం పొందారు. ఆయన వీరోచిత పోరాటాలు చరిత్రలో నిలిచిపోయాయి.