'ఖైదీలకు నాణ్యమైన వైద్యం అందించాలి'

'ఖైదీలకు నాణ్యమైన వైద్యం అందించాలి'

SKLM: జైలులో విచారణ ఎదుర్కొంటున్న ముద్దాయిల కేసుల స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం గార మండలం అంపోలులోని జిల్లా కారాగారాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ముద్దాయిలకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులకు సూచించారు.