ప్రత్యేక పంచాయతీ కోసం 'వెల్లమిల్లి' గ్రామస్థుల పోరు

ప్రత్యేక పంచాయతీ కోసం 'వెల్లమిల్లి' గ్రామస్థుల పోరు

ELR: వెల్లమిల్లి పంచాయతీ పరిధిలోని చినవెల్లమిల్లి, చింతాయగూడెం, లంబాడీగూడెంలను విడదీసి ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న రాత్రి చినవెల్లమిల్లిలో సమావేశమైన ప్రజలు, లక్ష్య సాధన కోసం ప్రత్యేక కమిటీని ఎన్నుకున్నారు. ఈ మేరకు బాధితులు ఇవాళ ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేయాలని నిర్ణయించారు.