యువకుడి మృతితో మిన్నంటిన బంధువుల రోదనలు

యువకుడి మృతితో మిన్నంటిన బంధువుల రోదనలు

కోనసీమ: రాజోలు మండలం కడలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కడలి నుంచి ములికిపల్లి వెళ్లే ప్రధాన రహదారిలో ఒక కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన యువకుడిని ములికిపల్లికి చెందిన కలిగితి తేజగా స్థానికులు ఆదివారం ఉదయం చెప్పారు. ఘటనా స్థలంలో యువకుడి బంధువుల రోదనలు మిన్నంటాయి.