'ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి'
SKLM: ఆమదాలవలస మండలం సైలాడ సచివాలయాన్ని డిప్యూటీ ఎంపీడీవో రామ్మోహన్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. సచివాలయం పనిచేసే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. సిబ్బంది రిజిస్టర్లు, పలు రికార్డులను తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. అలాగే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.