'మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములు కావాలి'
MNCL: గ్రామాల్లో మాదకద్రవ్యాలను ఎవరైనా పీల్చిన, విక్రయించిన పోలీసులకు సమాచారమిచ్చి, సహకరించాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. మాదకద్రవ్యాల వాడకం వలన కలిగే దుష్ప్రభావం, యాంటీ ర్యాగింగ్, కొత్త చట్టాలపై స్థానిక విద్యా భారతి పాఠశాలలో బుధవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు.