రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ప్రకాశం: పెద్ద దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రాచర్ల గ్రామానికి చెందిన బెస్త శరత్ (25) అనే వ్యక్తి మాచర్ల నుంచి డోన్‌లో జరిగే రంగనాథ స్వామి జాతరకు వెళ్తుండగా కారు, మోటార్ సైకిల్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై దోర్నాల ఎస్సై వెంకట రమణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.