రీకౌంటింగ్‌లో ఒక్క ఓటు తేడాతో విజయం
నిజామాబాద్ జిల్లాలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు ఉత్కంఠ నెలకొంది. మొదట మూడు ఓట్ల తేడాతో ఫలితం రాగా, మళ్లీ రెండవసారి రికౌంటింగ్ చేసి ఒక్క ఓటు తేడాతో కాంగ్రెస్ మద్దతుదారుడు జొన్నల నరేందర్ రెడ్డి గెలుపొందారు. మళ్లీ అలాగే సిద్దాపూర్, రాంపూర్ గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.