గురుకుల విద్యాలయం తనిఖీ

KRNL: ఎమ్మిగనూరు మండలం బనవాసిలోని గురుకుల బాలికల జూనియర్ కళాశాల, గురుకుల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఇవాళ సందర్శించారు. బాలికల జూనియర్ కళాశాలలో వసతులపై ఆరా తీశారు. అక్కడి సమస్యలను బాలికలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ నాణ్యమైన విద్యను అందించాలని ప్రిన్సిపల్‌ను ఆదేశించారు.