బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న మత్స్యకార కుటుంబాలకు సాయం

బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న మత్స్యకార కుటుంబాలకు సాయం

VSP: బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబాలకు విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి సీతంరాజు సుధాకర్ అండగా నిలిచారు. 30, 37వ వార్డుల పరిధిలో నివాసం ఉంటున్న 10 బాధిత కుటుంబాలకు ఆయన సోమవారం నిత్యావసర సరుకులను అందజేశారు. ప్రభుత్వం తరపున మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి కృషి జరుగుతోందని ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.