బెజ్జంకిలో 9 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలివే

బెజ్జంకిలో 9 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలివే

SDPT: బెజ్జంకి మండల వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు మండలంలో సుమారు 23 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పలువురు ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఎన్నికలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.